మన జాతీయ క్రీడ హాకీ కాదా?!
Published on August 3, 2012 · 1 Comment
చిన్నప్పటి నుంచి జాతీయ క్రీడ గురించి మనం తప్పుగా చదువుకొన్నామా? లేక మనం చదువకొన్నదే తప్పా? భారత ‘జాతీయ క్రీడ’ హాకీ కాదా? కాదనే అంటోంది దేశ క్రీడా మంత్రిత్వ శాఖ. ప్రభావం కోల్పోయిందనో, లేక విజయాలు గగనమైపోయాయనో…ఏమో కానీ క్రీడా మంత్రిత్వ స్వయంగా జాతీయ క్రీడ హాకీ కాదంటూ తెలిపింది. సమాచార హక్కు కింద పదేళ్లున్న ఐశ్వర్య అనే చిన్నారు చేసిన దరఖాస్తుకు సమాధానంగా క్రీడా, యువజన శాఖ అసలు జాతీయ క్రీడ హాకీ కాదంటూ తేల్చేసింది.
ఏదో జనాల్లో నాని జాతీయ క్రీడ హాకీ అయ్యిందని క్రీడా శాఖ అంటోంది. మరి భారత ప్రభుత్వ వెబ్ సైట్ లో మాత్రం ‘నేషనల్ సింబల్స్’ కేటగిరీలో జాతీయ గీతం నుంచి, జాతి కి సంబంధించిన అన్ని వివరాలు గరించి పేర్కొంటూ…జాతీయ క్రీడగా హాకీ సింబల్ ను ఉంచింది. జాతీయ చిహ్నాలుగా పేర్కొన్న వాటి ప్రశాస్తాన్ని వివరిస్తూ…’భారత జాతి గుర్తింపుకు, వారసత్వానికి ఈ చిహ్నాలు ప్రతీకలు. ప్రతి ఇండియన్ హృదయంలోనూ జాతి ఔన్నాత్యానికి ప్రతీకలుగా ఈ చిహ్నాలు ముద్రపడాలి’ అంటూ ఘనంగా చెప్పుకొచ్చింది. మరి ఆయా మంత్రిత్వ శాఖలేమో…ఏకంగా జాతీయ క్రీడ అంటూ ఒకటి లేదంటున్నారు..వ్యవస్థ పరంగా మనదేశంలోనే ఇంత దౌర్భాగ్యం ఉంటుందా?
No comments:
Post a Comment