మీ మెదడుకు వ్యాయామం కావాలి !
Published on July 1, 2012 · 7 Commentsyo
మన శరీరంలో ఏ భాగ మైనా సరే వాడకుండా వదిలేస్తే దాని పదును తగ్గుతుంది. మన మెదడు కూడా అలాంటిదే. మెదడు చేసే పనేంటా అని ఆలోచించక్కర్లేదు. చేతులు, కాళ్లు ఏవి కదపాలన్నా మెదడు కావాల్సిందే. మనకు తెలియకుండానే శరీర కదలికలు జరుగుతుంటాయి. కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం వస్తుంది. అపుడే మీరు మీ మెదడుకు పని కల్పించుతున్నట్లు తెలుసు కుంటారు.
దీనికోసం మన మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. వయసు పైబడుతుంటే మనమందరం మెదడుకుగల పదును కోల్పోతూ వుంటాం. కాని మెదడుకు రెగ్యులర్‌గా పని కల్పిస్తుంటే, మీ తెలివితేటలు మరింత వికసిస్తాయి. జ్ఞాపకశక్తి నశించకుండా వుంటుంది. వయసు పైబడుతున్నప్పటికీ మీలో మతిమరుపు వ్యాధి రాకుండా వుంటుంది.
ఐదు ప్రధాన వ్యాయామాలు
మెమొరీ గేమ్ : చాలామంది వ్యక్తులు పెద్ద వయసు వచ్చిందంటే అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటారు. వయసుతోపాటు మెమొరీ తగ్గటం సహజంగా వచ్చేస్తుంది. కనుక ప్రధానంగా మీ మెదడుకు పని కల్పిస్తూండాలి. మీ స్కూలులో తోటి విద్యార్థుల పేర్లను మరోమారు జ్ఞాపకం చేసు కోండి. ఈ వ్యాయామం మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, కాఫీ బ్రేక్‌లలో చేయవచ్చు.
విచక్షణ : మనం విచక్షణగా వ్యవహరించి బ్రెయిన్‌కు వ్యాయామం కల్పించాలి. చాలాసార్లు మనం మనకు తెలియకుండానే విచక్షణ చూపుతాం. కనుక ప్రతిపని మీరు కొంత లాజిక్‌తో చేయండి. అందుకుగాను, కొంత రాజకీయాలవంటివి పట్టించుకోవాలి. వాటిపై చర్చలు చేయాలి.
శ్రద్ధపెట్టటం : గతంలో చదువుకునే టప్పుడు తరగతి గదిలో చూపిన శ్రద్ధ నేడు ఆఫీసులో చూపుతామా ? చూపలేం. వయసుతో పాటు మనకు శ్రద్ధ కూడా తగ్గుతుంది. మన శ్రద్ధను మెరుగుపరచటానికి గాను కొంచెం బాధాకర వ్యాయామం చేయాలి. అడ్డగోలుగా వాగే ఆఫీసు కొలీగ్‌ను ఎంచుకోండి. అతను ఏ చెత్త విషయాలు మాట్లాడినా శ్రద్ధగా వినండి. అది మీ లోని శ్రద్ధను మెరుగుపరుస్తుంది.
No comments:
Post a Comment