Friday, 3 August 2012

latest government job news


15 లక్షల ఉద్యోగాలిస్తాం : ముఖ్యమంత్రి

Published on August 3, 2012   ·   No Comments
Share
‘‘ఇచ్చిన మాట ప్రకారం 2014 నాటికి తాము చెప్పినట్లుగా 15 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలుకల్పిస్తాం. ఈ ఏడాది మూడు లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇస్తాం’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో మారు తేల్చిచెప్పారు. రాజీవ్ యువకిరణాల కింద గతంలో యువతకు ఉద్యోగాలిస్తాం అని ప్రకటించగా అది అభాసుపాలయింది. తాజాగా శుక్రవారం రాజీవ్ యువకిరణాల పథకంపై నిర్వహించిన సమీక్ష సంధర్భంగా అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారు.
హైదరాబాదులోని జూబ్లీహాల్‌లో యువ కిరణాలు, ఎంప్లాయిస్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ కార్యక్రమంలో కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని, యువతకు ఉపాధి కల్పించడంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టి పెట్టారని చెప్పారు. యువత ప్రయివేటు రంగంలో ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, గ్యాస్ కొరత వల్లే ఈ ఇబ్బంది ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ కోత వల్ల పరిశ్రమలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. కామన్ ఫీజు వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
digg

No comments:

Post a Comment