Friday 3 August 2012

ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ?


ఎముకలు పటిష్టంగా ఉండాలంటే ?

Published on July 7, 2012   ·   1 Comment
Share
మన శరీరానికి ఆధారం ఎముకలు. మరి మన ఎముకల్లో సమస్యలుంటే ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉంటుంది. మన శరీరంలోని ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  ఎముకలకు విటమిన్‌ డి క్యాల్షియం అవసరం. రోజూ గ్లాసుడు పాలు రోజూ తీసుకుంటే ఎముకలకు తగిన క్యాల్షియం లభిస్తుంది. అలాగే తాజాపండ్లరసాలను తీసుకోవడం ద్వారా విటమిన్‌’డి’ లభిస్తుంది.
పాల ఉత్పత్తులు, తృణ ధాన్యాలు, నట్స్‌ తీసుకుంటే ఎముకలకు కావలసిన శక్తి లభిస్తుంది. ఉదాహరణకు ఒక బాదంపప్పులో 75మి.గ్రాల క్యాల్షియం ఉంటుంది. అలాగే నువ్వుల్లో 37మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
రోజువారీగా తాజా కూరగాయలు తీసుకోవడం ద్వారా ఎముకలకు చాలా మంచిది. బీట్‌రూట్‌, క్యారెట్‌, బీన్స్‌, స్వీట్‌ పొటాటోస్‌, దోసకాయ వంటివి తీసుకుంటే  ’ఎ’విటమిన్‌ లభిస్తుంది. కాలిఫ్లవర్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్‌ ‘కే’ లభిస్తుంది. ఇవి ఎముకలకు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ వాకింగ్‌, ఎరోబిక్స్‌, బాస్కెట్‌బాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి.
digg

No comments:

Post a Comment