రూపాయి పతనం ఆగేనా ?
United States Dollar (USD) to India Rupees (INR) Exchange Rate
US $1 = Rs 55.7564
Rs1 = US $ 0.0179
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గత కొంత కాలంగా రూపాయి పతనం కొనసాగుతున్నది. ముఖ్యంగా అమెరికా కరెన్సీ డాలర్‌కు ఏర్పడిన డిమాండ్ ఎప్పటికప్పుడు రూపాయిని ముంచుతూనే ఉన్నది. డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఐదవ రోజు శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి పడిపో యింది. గత మార్చి నుంచి 16 శాతం బలహీనపడిన రూపాయి గత కొన్ని రోజులుగా తీవ్రంగా నష్టపోయి శుక్రవారానికి 57.37గా నిలిచింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో అటు ఇంట్రాడే ట్రేడింగ్‌లోనూ, ఇటు ముగింపులోనూ రెండింటా కనిష్టస్ధాయికి చేరకుంది. రూపాయి విలువ చరిత్రలో మునుపెన్నడూ ఈ స్ధాయికి చేరలేదు.
మే 30న రూపాయి రికార్డు స్థాయిలో 56.23 స్థాయి వద్ద ముగిసింది. మే31న ఇంట్రాట్రేడింగ్‌లో 56.52 కనిష్టానికి తాకింది. ఇప్పటిదాకా రూపాయికి రెండు విధాల ఇవే కనిష్ట స్థాయిలు. ముఖ్యంగా చమురు ఎగుమతిదారుల నుండి డాలర్‌కు ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. కాని శుక్రవారం రూపాయి విలువ 57.15 వద్ద ముగిసింది. ఈ ఏడాది లోనే అత్యంత గరిష్టంగా ఒక్క రోజులోనే దాదాపు 85 పైసలకు పడిపోవడం ఇదే తొలిసారి.
కాగా వరసగా ఐదవ రోజు కూడా రూపాయి పతనం కొనసా గుతున్నప్పటికీ ఫారెక్స్ మార్కెట్‌లో రిజర్వుబ్యాంకు జోక్యం చేసుకోకపోవడం శోచనీయమని డీలర్లు అంటున్నారు. ముడిచమురు ధరలు 18 నెలల కనిష్టానికి బారెల్ ధర 90 డాలర్లకు పడిపోయిన నేప థ్యంలో చమురు దిగుమతి దారుల నుండి డాలర్‌కు డిమాండ్ ఏర్పడిన కారణంగా రూపాయి 57 స్థాయి వద్ద నిలిచిపోయిందని వారు చెబుతున్నారు.
No comments:
Post a Comment