బ్యూటీ క్రీమ్ ల వల్ల డయాబెటిస్!
Published on July 14, 2012 · 2 Comments
ప్రతి నిత్యం వాడే సోపులు, నెయిల్ పాలిష్ లు, ఫెర్ఫ్యూమ్, స్ప్రే, బాడీ మాయిశ్చరయిజెస్ ల వల్ల డయాబెటిస్ సోకే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనం తేల్చింది. ప్రత్యేకించి చాలా శ్రద్ధతో ఇలాంటి సౌందర్య లేపనాలు వాడే స్త్రీలు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. స్త్రీ వైద్య నిపుణులు, కొంత మంది పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం డయాబెటిస్ విషయంలో ఈ కొత్త కారణాన్ని కనుక్కొంది. అందంగా కనిపించాలనే తాపత్రయంతో విపరీతంగా బ్యూటీ పార్లల్ లను సందర్శిస్తూ…స్వయంగా కూడా ఎడాపెడా నెయిల్ పాలిష్ లు ఇతర సౌందర్య లేపనాలు శరీరానికి రాసే అలవాటున్న మహిళల యూరిన్ లో డయాబెటిస్ లక్షణాలు కనిపించాయని, వారు కొంత వయసు వచ్చాక డయాబెటిస్ బారిన పడే అవకాశాలున్నాయని డాక్టర్లు అంటున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే సౌందర్యం కోసం క్రీములు, సోపులు వాడేవారు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు దాదాపు 70 శాతం వరకూ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఇది చాలా శాస్త్రీయ బద్దంగా జరిగిన అధ్యయనం, ఇది మహిళలకు కచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరి ఎడాపెడా షాంపూలు, ఫేస్ క్రీమ్ లు వాడే అమ్మాయిలు జాగ్రత్త వహించడం మంచిది!
No comments:
Post a Comment