ఈ నేతలకు బుద్ధి రాదు…
Published on July 21, 2012 · 13 Comments
రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవడం వల్లే రేప్ లు జరుగుతాయని అంటాడు ఓ డీజీపీ... నాలిక్కరుచుకుంటాడు
ఎక్స్ పోజ్ చేసే దుస్తులు అబ్బాయిలను చెడగొడతాయంటాడు ఇంకో నేత… మళ్లీ తిట్లు తింటాడు..
అమ్మాయిల వస్త్రధారణే స్త్రీలపై నేరాలు పెరగడానికి కారణం అంటాడు ఇంకో అధికారి… చీవాట్లు పెట్టించుకుంటాడు.
ఆ వ్యాఖ్యలు చేస్తే… విమర్శలు, తిట్లు, చీవాట్లు అన్నీ తినాల్సి ఉంటుందని తెలిసినా మళ్లీ అవే అవే వ్యాఖ్యలు చేయడం మామూలైపోయింది. తాజాగా మరో నేత నోరు పారేసుకున్నారు. యువతులు తమ దేహ అందాలు తెలిసేలా బట్టలు ధరించడం వల్ల నేరాలు పెరిగేఅవకాశం ఎక్కువవుతుందని అన్నారు. కాబట్టి రెచ్చగొట్టే దుస్తులు మానేయమని, అది చాలా మంచి మార్గమని అన్నారు. ఆయన ఎవరో కాదు.. మధ్యప్రదేశ్ రాజకీయ నేత, మంత్రి కైలాష్. మహిళలు భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఫ్యాషన్లు అనుకరిస్తే ఏ సమస్య ఉండదన్నారు. వారి వస్త్ర ధారణ చూస్తే మనకు వారిమీద గౌరవం పెరగాలి.. కానీ, ప్రస్తుతం రెచ్చగొట్టేలా ధరిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు. అసలు ఇలాంటి దుస్తుల వల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. అది నిజమా, అపద్ధమా అనేది పక్కన పెట్టి… మాకా హక్కులేదా అని మహిళా సంఘాలు రేపట్నుంచి పోరాటాలకు దిగడం, మళ్లీ ఆయన సారీ చెప్పడం, మీడియా వ్యాఖ్యలను వక్రీకరించింది అనడం మామూలే. కానీ, తెలిసి తెలిసి ఇలా ఎందుకు మాట్లాడుతారో వీళ్లు.
No comments:
Post a Comment