Sunday 30 December 2012

HAPPY NEW YEAR


Saturday 29 December 2012

బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు, యల్లాయపాళెం వచ్చినప్పుడు పందిపాటి సుబ్బరామిరెడ్డి గారి కిచ్చిన ఉత్తరం

                                 బాబూ రాజేంద్ర ప్రసాద్ గారు, యల్లాయపాళెం వచ్చినప్పుడు పందిపాటి సుబ్బరామిరెడ్డి గారి కిచ్చిన ఉత్తరం

మహాత్మా గాంధీ గాంధీ, యల్లాయపాళెం వచ్చినప్పుడు పందిపాటి సుబ్బరామిరెడ్డి గారి కిచ్చిన ఉత్తరం

మహాత్మా గాంధీ గాంధీ, యల్లాయపాళెం వచ్చినప్పుడు పందిపాటి సుబ్బరామిరెడ్డి గారి కిచ్చిన ఉత్తరం


ఇరుగు పొరుగు గ్రామాలు,ముఖ్యమైన ఫోన్ నంబర్లు


ఇరుగు పొరుగు గ్రామాలు

రెడ్దిగుంట(2 కి.మీ.), రామచంద్రా పురం(దాసరి పాళెం) (1.5 కి.మీ.), తాటాకుల దిన్నె(2 కి.మీ.),మిక్కిలిం పేట(4 కి.మీ.), గ్రామనత్తం(4 కి.మీ.), పల్లెపాళెం(1 కి.మీ.), పాటూరు(4 కి.మీ.)
బుచ్చిరెడ్ది పాళెం(8 కి.మీ.),గండవరం(6 కి.మీ.), రాజుపాళెం(5 కి.మీ.), కోవూరు(8 కి.మీ.), దామర మడుగు(6 కి.మీ.), రేబాల (5 కి.మీ.)

[మార్చు]ముఖ్యమైన ఫోన్ నంబర్లు

  • టెలిఫోను ఎక్స్చేంజి : +91-8622-277798
  • పంచాయితి కార్యాలయం : +91-8622-277702
  • సహకారసంఘం (వ్యవసాయం) : +91-8622-277778
  • ఆంధ్రాబ్యాంక్ : +91-8622-278734

గ్రామ సర్పంచులు


గ్రామ సర్పంచులు

  • ప్రస్తుత సర్పంచ్ - దేవిరెడ్డి శ్రీలక్ష్మి
  • గతంలోని సర్పంచులు
_______________________
  • " - చేవూరు సుబ్బరామి రెడ్డి
  • " - పందిపాటి రామిరెడ్డి
  • " - రేబాల వేణు గోపాల క్రిష్ణారెడ్డి
  • " - గండవరపు బాలక్రిష్ణా రెడ్డి " -రామిరెడ్డి
  • " - బడుగు శ్రీనివాసులు

యల్లాయపాళెంవ్యవసాయం


వ్యవసాయం

ఒకప్పుడు వరిచెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.
  • ఇప్పుడు రొయ్యలసాగు ఆగిపోయింది.ఆ మాటకొస్తె జిల్లాలో కూడ సాగుబడి చాలవరకు తగ్గిపోయింది.ఒకప్పుడు 1,50,000 ఎకరాలు సాగులోవుండేవి.
ఇప్పుడు 50,000.ఎకరాలు కంటే సాగు తగ్గిపోయింది.రొయ్యల గుంటలన్ని పూడ్చి మళ్ళి వరి సాగుమొదలు పెట్టారు. గ్రామంలో దాదాపు 3,000ఎ.సాగుబడి పొలం వున్నది.పడమరనున్న అడివి పొలం తప్పితే మిగిలిన పొలానికి చాలవరకు బోరు బావులున్నాయి. మొదటి కారు,అప్పుడప్పుడు రెండొ కారు కనిగిరి చెరువు నీటితో సాగు అవుతున్నాయి. 20సం:ముందు ప్రధాన పంటగా మొలగొలుకులు, రెండో పంటగా దొంగ నెంబర్లు(అంతకుముందు ఎర్రకేసర్లు)పండించేవారు.ఇప్పుడు మొలగొలుకులు కనుమరుగయినాయి.మూడు పిడికిళ్ళులాంటి హైబ్రిడ్ రకాలు సాగుచేస్తున్నారు. పొలాల ధరలు కూడ బాగా పెరిగాయి.ఒక ఎకరం రూ.పది లక్షలు. గతంలో 200-300 ఎకరాల కమతాలు కొన్ని వుండేవి.ఇప్పుడు 30 ఎ.మించి ఎవరికి లేవు. గతంలో ఎద్దులు,బండ్లు,నాగళ్ళు,తదితర పరికరాలతో వ్యవసాయం చేసేవారు.ఇప్పుడు ట్రాక్టర్లు,వరికోత మిషన్లు. వ్యవసాయ కూలీలు బాగా తగ్గిపోయారు.సేద్యం చేయించడం చాలా కస్టంగా వుంది.
  • పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిచెందినది.పాలు గతంలో బస్సులోను,సైకిళ్ళలోను నెల్లూరుకు తీసికెళ్ళి అమ్మేవారు.ఇప్పుడు పాల సొసైటీలు వున్నాయి.

దేవాలయాలు


దేవాలయాలు

  • మహలక్ష్మమ్మ గుడి.
  • కంభం రాతి ఆంజనేయ స్వామి గుడి
  • సాయి బాబా గుడి.
  • కుమ్మరివీధి రామ మందిరం
  • గంగమ్మ గుడి
  • బ్రహ్మం గారి గుడి.
  • మసీదు.
  • శివాలయం.
  • తూర్పు వీధి రామ మందిరం.
  • శివబాబా ఆలయం(ఓం శాంతి)
  • చర్చి.
  • చెన్నకేశవ స్వామి ఆలయం.
  • గ్రామ పొలిమేరలలో గ్రామ దేవతలు

గ్రామములో సౌకర్యాలు


గ్రామములో సౌకర్యాలు

యల్లాయపాళెం ప్రాధమిక పాఠశాల విద్యార్ధులు
1977లో పదవ తరగతి చదివిన యల్లాయపాళెం విద్యార్ధులు
  • 1-5 తరగతుల వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలదు.
  • 6-10 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.
  • అంగన్ వాడి బడి.
  • బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలకు వసతి గృహాలు.
  • పంచాయితీ కార్యాలయం.
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
  • పశువుల ఆస్పత్రి.
  • పోస్ట్ ఆఫీస్.
  • టెలిఫోన్ ఎక్స్ఛేంజ్.
  • పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం.
  • వ్యవసాయదారుల సహకార సంఘం.
  • ఆంధ్రా బ్యాంక్.
  • జిల్లా గ్రంథాలయం.
  • బాపూజీ విజ్ఞాన కేంద్రం.
  • కంప్యూటర్ మరియు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు
  • cramebridge em school

గ్రామం లోని వివిధ ప్రాంతాలు


గ్రామం లోని వివిధ ప్రాంతాలు

గ్రామములోని వివిద ప్రాంతాలను గ్రామవాసుల పిలుపులలో ఈ విదంగా పలుకుతారు -
చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ.
వాడుక పదాలు ప్రాంతాలు
చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు

యల్లాయపాళెం చరిత్ర


చరిత్ర

1946 ముoదు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేటి గ్రామాలలో ఒకటి. ఊళ్ళో పంట రెడ్లు ఎక్కువ. వీరు భూస్వాములూ వ్యవసాయదారులూ కూడా. వీరు కాక దేవాంగులూ(చేనేత పనివారు), ముస్లిం లు, బలిజ వారు, హరిజనులు, ఇతర చేతి వృత్తుల వారు ఉండేవారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే చాలాకాలంగా పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, వాలు పాఠ్యంపెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో గూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉంది.
1946 తర్వాత
చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మేటి గ్రామం గానే వెలుగొందుతోంది. గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.
1950 దశకంలొ[ఆధారం కోరబడినది] అప్పుడు నేను పది సం.వాడిని .నాకు నాకంటే పెద్దవారికి ఈసంగతులన్ని తెలుసు.ఇప్పుదు నేను అమెరికాలో ఉన్నాను.ఆధారాలు కోసం ప్రయత్నిస్తాను.
గ్రామం లొ తగాదాలు వుండేవి.రైతులు హరిజనులు మధ్య కొట్లాటలు జరిగాయి. ఇరువురు కొన్నిసార్లు కర్రలతోను,కొన్నిసార్లు కత్తులతో కొట్లాడుకొన్నారు. చాలా మంది పెద్ద గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇరువురు పోలీసు కేసులు పెట్టుకున్నారు.ఈ జామీనుకేసుల్లో జిల్లాలోని వివిధ కోర్టుల చుట్టూ తిరిగారు. అలిసిపోయారు.తిరిగి ప్రశాంతత నెలకొన్నది.
1960 దశకంలో
భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామంలోని యువత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసారు. యువత విజయం సాధించింది.గండవరపు బాలక్రిష్ణా రెడ్డి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
1970 దశకంలో
గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యం మొదలయింది.మళ్ళీ కొంతకాలం తగాదాలు,కొట్లాటలు జరిగాయి. ఒక రైతు కూడ చనిపోయాడు. ప్రస్తుతం పెద్ద తగాదాలు లేవు.కాని సదవగాహన కూడ లేదు.

యల్లాయపాళెం పుట్టుక

 యల్లాయపాళెం పుట్టుక


ఆ రోజు వాతావరణం కొద్దిగా మబ్బులు పట్టి వుంది. ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా, 'ఆ, ఈ మబ్బులు కాసేపే' అంటూ రోజూ లాగే పశువులు తోలుకుని అడవిలోకి బయలుదేరాడు. వాతావరణం బావుందేమో! తెలీకుండానే పశువులతో పాటుగా చాలా దూరం వచ్చేశాడు. దారిలో చిన్న వాగు, వాగు కి అవతల వృక్షాలు, పచ్చటి ప్రాంతం చూసి నెమ్మదిగా వాగు దాటి అక్కడికి చేరాడు. ఇక ముందుకు కదలాలనిపించలేదు. అక్కడ పశువులని మేతకి వదలి, తను కూడా తనతో పాటే తెచ్చుకున్న చద్దన్నం తిని, వాగు లోని నీళ్ళు తాగాడు. ఇక్కడ నీళ్ళకి ఇంత రుచి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద నిద్ర లోకి జారి పోయాడు.
ముసురు పట్టిన మబ్బు ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సారి గా పెద్ద వర్షం. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న అతను పశువులని హడావిడి గా తోలుకుంటూ కాస్త ఎత్తైన ప్రదేశం చేరాడు. సరేలే, ఈ వాన తగ్గాక, ఇక ఇంటికి వెల్లిపోదాం అనుకుంటున్నాడు. వర్షం తగ్గక పోగా ఇంకాస్త భీకరంగా మారింది. ఈ రాత్రికి ఇక ఇక్కడే, ఒక్కడినే ఎలానో అనుకుంటూ చాలా సేపటికి నిద్ర లోకి జారుకున్నాడు. రాత్రంతా కుండపోత గా కురిసిన వాన తెల్లవారేసరికి మందగించింది.
దాంతో పశువులను తోలుకుని తిరుగుముఖం పట్టాడు. తీరా వాగు దగ్గరికి వచ్చేసరికి... నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న పిల్ల వాగు ఉగ్ర నాగు లాగా వుంది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. అది ఎప్పటికి తగ్గుతుందో తెలీని పరిస్ఠితి? అతనికేం తెలుసు, అక్కడే ఇంకొద్ది రోజులు గడపాలని... అలా వాగు మామూలు పరిస్ఠితి కి వచ్చేవరకు, ఆ ప్రాంతం లో నే ఫలాలు తింటూ, పశువుల పాలు తాగుతూ కొద్దిరోజులు గడిపాడు. ఆశ్చర్యకరమేమిటంటే, ఆ ప్రాంతం లో మేత తిన్నాక పశువులు అంతకుముందెన్నడూ లేనట్లు గా విపరీతంగా పాలివ్వడం ప్రారంభించాయి. అతనికి కూడా అక్కడ వున్నన్ని రోజులు తిండి కి ఇబ్బంది కాలేదు.
కొద్దిరోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరిన అతను ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పాడు. దాంతో వారందరికీ కూడా ఆ ప్రాంతం చూడాలని అనిపించడంతో అందరూ కలిసి ఆ ప్రాంతం వచ్చి అంత మంచి ప్రాంతం వదలివెళ్ళడం ఇష్టం లేక అక్కడే స్ఠిర పడి పోయారు. ఇలా వారంతా స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది.
ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్తులు ఊరి పుట్టుక గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒకటి.

హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు


దస్త్రం:CowHA.jpg
ఆవులు (ఆంగ్లం Cow) హిందువులకు ఎంతో పవిత్రమయిన జంతువులు. వీటి నుండి పితికే పాలు ఎంతో శ్రేష్టమయినవి. గ్రామాలలో వీటి పేడను పిడకలుగా తయారు చేసి వంటచెరకుగా ఉపయోగిస్తారు[1]. ఇవి చనిపోయిన తరువాత వీటి చర్మాన్ని ఉపయోగించి చెప్పులు మొదలయిన తోలువస్తువులు తయారు చేస్తారు. కొన్ని దేశాలలో వీటిని మాంసం కోసం కూడా పెంచుతారు.ఎద్దులు ఎద్దులు వ్వవసాయ దారునికి ఎంతో ఉపయోగం: వీటిని భూమి దున్నడానికి, బండి తోల డానికి ఇలా అనేక వ్వవసాయ పనులకు వినియోగిస్తారు. ఒకప్పుడు ఎద్దులు లేకుండా వ్వవసాయం చేయ వీలుండేది కాదు. ప్రస్తుతం యంత్రాలొచ్చాయి. అయినా ఎద్దులతో పనులు ఇంకా అక్కడక్కడా కొనసాగుతున్నాయి. ఎద్దులలో ముక్యంగా చెప్పుకోదగ్గది ఒంగోలు గిత్త. వీటి ఠీవి, అందం, వీటి భలం, ఇలా ఏ విషయంలో నైనా వీటితో పోటీ పడే ఎద్దులు మరేవి లేవు. అందుకే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వున్నది. అందుకే వీటి ధరలు లక్షల్లో వుంటాయి. ఈ జాతి అంత రించి పోయే దిశలో వున్నది.
ఆవు. ఒక సాదు జంతువు
హిందువులకు ఆవు ఆరాద్యమైనది. ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెపుతున్నాయి. ఆవు పాదాల్లో పిత్రుదేవతలు, అడుగుల్లో అకాశ గంగ, స్థనాలలో చరుర్వేదాలు పాలు పంచామృతాలు, కడుపు కైలాసం, ఇలా ఒక్కొ భాగంలో ఒక్కో దేవతకు నివాసం. అందుకే గోమాతకు ప్రధక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితం వస్తుందని ప్రదక్షిణలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేద , మూత్రం లలో ఎన్నో ఔషద గుణాలున్నాయని ప్రతీతి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికి తెలిసినదే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలె శరణ్యం: ఆహారంగానె కాకుండా అరాద్యంలోను అనగా పూజ పునస్కారాలలోని వీటి ప్రాశస్త్యం తెలియని వారుండరు. అలాగె ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలెడతారు. సకల దోష నివారణకు ఆవు పంచితాన్ని ఇంటా బయట చల్లు తారు. ఇది హిందువుల ఆచారం:
ఆవు పంచితాన్ని మరిగించి వచ్చే ఆవిరితో తయారు చేసిన ఔషదమే గోమాత అర్క్ చీరాల పట్టణానికి చెందిన రామ ధూత గో సంరక్షణా సంఘం దీనిని తయారు చేసి విక్రయిస్తుంటారు. అందులో మన శరీరానికి కావలసిన నత్రజని, గందకం, అమ్మొనియా, పొటాషియం, విటమిన్లు, లవణాలు పుష్కలంగా వున్నందున గోమూత్రానికి సర్వ రోగ నివారిణిగా మంచి పేరుఇన్నది. ఇది ఒక లీటరుకు సుమారు నూట యాబై రూపాయలకు విక్రయిస్తున్నారంటే దాని ఔషద విలువ ఎంతో తెలుస్తుంది. అంతే గాక ఆవు నుంచి వచ్చే పంచగవ్వ ద్వారా అగరబత్తులు, సౌందర్య సాధనాలు, సబ్బులు, క్రిమి సంహారకాలు, సుబ్ర పరిచే ద్రావణాలు తయారు చేస్తారు. తెలుగు బాలలు అమ్మ అనే మాట తర్వాత మొదటిగా నేర్చేది ఆవు అనె మాటనె.
భారత దేశానికి రైతు వెన్నుముక అని అంటుంటారు. అటువంటి రైతుకు వెన్నెముక వంటిది ఆవు. రైతుకు భూమి లేక పోయినా ఆవులుంటాయి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆదారంగా బతగ్గలడు. ఆవుకు పుట్టిన కోడెలు (ఎద్దులు) రైతుల భూములను దున్నుతాయి. బండ్ల ద్వారా రైతు పంటలను ఇళ్లకు చేర వేస్తాయి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండ దండ గా వుంటాయి. అందుకే రైతులు ఆవులను ప్రేమిస్తాడు, పూజిస్తాడు,ఆరాదిస్తాడు, పోషిస్తాడు. తమ పిల్లలు లాగా కాపాడు కుంటాడు. ఆవు పేడద్వార గోబర్ గ్యాసు ఉత్పత్తి చేసి వంట చెరుకుగా వాడు కుంటాడు. మిగిలిన వ్వర్థాన్ని పంట పొలాలకు ఎరువుగా వాడు కుంటాడు. చివరకు ఆవు చనిపోయిన తర్వాత కూడ దాని చర్మాన్ని చెప్పులకు ఉపయోగిస్తారు. ఈ విధంగా మనిషికన్నా ఆవె గొప్ప. ఈ విషయాన్ని ఆవు స్వగతంలో చెప్పుతున్నట్లు ఒక సినిమా పాట వున్నది. వినరా.. వినరా.... నరుడా తెలుసు కోరా పామరుడా...... గోమాతను నేనేరా నాతో సరిరారురా.......... ఇలా ఆపాట చాల హృద్యంగా సాగుతుంది. గో సంరక్షణార్థం మనదేశంలో చట్టాలు చాలానె వున్నాయి. కాని వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా వున్నది.
ఇంతటి ప్రాశస్త్యం గలిగిన ఆవులు గతంలో మనదేశంలో చాల జాతులు వుండేవి. కాల క్రమేణ అవి చాల వరకు అంత రించి పోయాయి. ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది జాతులు మాత్రం మిగిలి వున్నాయని పరిశోధకులు చెపుతున్నారు. ప్రస్తుత కాలంలో ఆవులలో సంకర జాతులు, జర్సీ ఆవులు వంటివి ఎక్కువగా వున్నాయి. ఇవి పాలు ఎక్కువ ఇస్తున్నందున రైతులు వీటి పై మక్కువ చూపు తున్నారు. ప్రభుత్వంకూడ వీటికి సరైన ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రస్తుతం అనేక మంది రైతులు ఇటు వంటి సంకర జాతి ఆవుల పెంపకంలో తమ జీవనాన్ని సాగిస్తున్నారు.
కాని ఔషద సేవనలో, ఆచార వ్వవ హారాలకు, ఆరాధనా ప్రక్రియలలో దేశ వాళి ఆవులకు, వాటి ఉత్పత్తులకే ప్రాధాన్యత వున్నది. అందు చేత ఈ దేశ వాళి గోవులను, వాటి లుత్పత్తులను వాటి ప్రాధాన్యతను నేటి తరానికి పరిచయం చేయడానికి డా:బి.అర్.కె.ఆర్. ప్రభుత్య ఆయుర్వేద కళాశాల వారు మరియు చరక డైరి వారు సంయుక్తంగా దేశ వాళి ఆవుల ఉత్సవాన్ని 28..3..2012 నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించారు. వాటి ఉత్పత్తులను, ప్రదర్శనకు, అమ్మకానికి పెట్టారూ. అదే విధంగా గోమాతకు ప్రధక్షిణం చేసే అవకాశాన్ని కల్పించారు.
ప్రస్తుతం మిగిలివున్న దేశ వాళి గో జాతుల్లోని కొన్నింటి విశేషాలు; 1. కపిల: ఇది అరుదైన జాతి. నల్లగా చూడ ముచ్చటగావుంటుంది.
2. దయోని: అందమైన ఆకారం గల ఈ గోజాతి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో వున్నాయి.
3. ఒంగోలు: ఈ జాతి ఆవులు ఆంద్ర ప్రదేశ్ లో మాత్రమె వున్నాయి. ఈ జాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. వీటి ఆంబోతులు రాజ ఠీవి తో ఎంతో దర్పంగా వుంటాయి.
   అతి బారి శరీరంతో ఠీవి గా అందంగా తెల్లగా వుండే ఈ ఆవులు కొమ్ములు మాత్రం పొట్టిగ వుంటాయి.  వీటి ధరలు లక్షల్లో వుంటుంది.  
4. పుంగనూరు జాతి: ఈ జాతి ఆవులుకూడ ఆంధ్ర ప్రదేశ్ చెందిన చిత్తూరు జిల్లా పుంగునూరు పట్టణానికి చెందినవి. అతి చిన్న ఆవులుగా ఇవి త్వరలో గిన్నిస్ బుక్ లో
   రికార్డు నామోదు కాబడనున్నది.  వీటి ఎత్తు రెండున్నర అడుగులు మాత్రమె.  
5. గిర్ జాతి. ఈ జాతి గోవులు గుజరాత్ కు చెందినవి. ఇవి కూడ పాల ఉత్పత్తిలో మంచివె. ఇవి ఖరీదైనవి కూడ. 6. షాహియత్: ఈ జాతి గోవులు రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ వుంటాయి. వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములతో బలమైన ఆకారంతో ఇవి ఎంతో హుందాగా
   అందంగా వుంటాయి.

YellayaPalem Sivaalayam


రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు - మలేషియా

మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఛాయాచిత్రాలు

history of telugu maha sabhalu

                    మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు


రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు

మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు



తెలుగుజాతి చారిత్రిక నేపథ్యంలోకి మీకిదే సాదర స్వాగతం

తెలుగుజాతి చారిత్రిక నేపథ్యంలోకి మీకిదే సాదర స్వాగతం



Thursday 6 December 2012

5 ఏళ్లలో అరకోటి ఇళ్లు


NewsListandDetails
రాష్ట్రంలో విద్యుత్‌ ఉతపత్తి రెట్టింపు చేస్తామని, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రణాళికలో వివరించారు. సోమవారం ఆయన తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసారు. గుజరాత్‌ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివ]ద్ధి చెందు తుందన్నారు.నిరుపేదల నుండి  కొత్త మధ్యతరగతి ప్రజలు వస్తున్నారని ఆయన వివరించారు. అన్ని నివాస గ]హాలకు సురక్షిత  మంచినీరు అందిస్తామని, 30 లక్షల మందకి ఉద్యోగాలు, అదే విధంగా 50 లక్షల మందికి నివాస గ]హాలు నిర్మాణం చేస్తామన్నారు. సూరత్‌,వడోదర,రాజ్‌కోట్‌ నగరాలలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం  పూర్తి చేస్తామని ఆయన తన ఎన్నికల మానిఫెస్టోలో వివరించారు. నిరుపేదల నుండి కొత్తగా మధ్యతరగతి ప్రజలు వస్తున్నారన్నారు. నిరు పేదలకు అతి తక్కువ ఖర్చుతో పక్కా గ]హాలు నిర్మిస్తామన్నారు. అదే విధంగా మహిళా సాధికారితకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. గ్రామీణ యోజ్‌గార్‌ పథకాన్ని గ్రామ స్థాయిలో ప్రవేశపెట్టి గ్రామాలను మరింతగా అభివ]ద్ధి చేయడం జరుగుతుందన్నారు. జౌళి ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్‌ పాల ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా తీసుకుని రావడానికి క]షి చేస్తున్నట్లు ఆయన వివరించారు. యువకులను అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్లడానికి ప్రణాళికలు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే గుజరాత్‌ యువ కులు అÊగ్రగామిగా ఉండడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంచి  నిపుణు లుగా తీర్చి దిద్దుతామన్నారు. రైతులపై రుణభారం పడకుండా జాగ్రత్తలు తీసు కుంటామన్నారు. వారికి వడ్డీలేని రుణాలు అందచేస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతనసాంకేతిక వ్యవస్థను తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతామన్నారు.

Wednesday 5 December 2012

ప్రేమను నిరూపించుకోవాలి

NewsListandDetails
ప్రేమను నిరూపించుకోవాలి ఒకరిని ప్రేమించడమంటే, ప్రేమించే సత్తాను కూడదీసుకొని, యదార్థం చేసుకోవడం. ప్రేమలో ఉన్న ప్రాధమిక నిశ్చయం, ప్రేమించిన వ్యక్తిని మానుష గణాల అవతారంగా గ్రహించి, దానివైపు నిర్దేశిత మవ్ఞతుంది. ప్రేమించడమంటే మనిషిని యధాతధంగా ప్రేమించడమే. విలియమ్‌ జేమ్స్‌ చెప్పిన 'శ్రమ విభజన రీతిలో ఒకడు తన కుటుంబాన్ని ప్రేమించి, కొత్తవానిని ప్రేమించకలేకపోతే అది ప్రాధమిక ప్రేమ అసమర్థతకు గుర్తు. తరచు మనం అనుకొన్నట్లు, ఎవరో ఒకరిని ప్రేమించిన తర్వాత అందులోనుంచిుత్పన్నమయ్యే అమూర్తభావన కాదు ప్రేమ. ఎవరినో ఒకరిని ప్రేమించడంలో అది ఉత్పన్నమవ్ఞతున్నప్పటికి, దానికి మాతృక అదే. దీనినిబట్టి ఇతరులు నా ప్రేమకు ఎలా వస్తువ్ఞలో నేను అంతేనని తేలుతుంది. జీవితాన్ని సుఖసంతోషాదులను, స్వేచ్ఛా వికాసాలను నిరూపణం చేసుకోవడమనేది అతని ప్రేమ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, ఆపేక్ష, గౌరవం, బాధ్యత, అవగాహనలతో వేరూని ఉంటుంది. ఒక వ్యక్తి సృజనాత్మకంగా ప్రేఇంచగలిగి  నపrడే తనను తాను ప్రేమించుకోగలుగుతాడు. అతడు ఇతరులను మాత్రమే ప్రేమించగలిగితే, అసలతడు ప్రేమించలేనేలేడు. స్వప్రేమ, పరప్రేమ సంయోజకాలని ఒపrకొన్న తర్వాత, పరుల మీద ఆపేక్షను త్రోసివేసి స్వార్థాన్ని, మనం ఎలా వివరిస్తాం. స్వార్థపరుని కెపrడూ తనమీదే ఆసక్తి. అన్నీ తనకే కావాలంటాడు. పుచ్చుకోవడంలో తప్ప, అతనికి ఇవ్వడంలో ఆనందం లేదు. బాహ్యప్రంచం నుంచి తనకు చేకూరే మేలును దృష్టిలో పెట్టుకొని, దానిని చూస్తాడు.

పచ్చ కామెర్లకు కారణమయ్యే వైరస్‌లు


NewsListandDetails
వైరల్‌ హెపటైటిస్‌ అనే వ్యాధి హెపటైటిస్‌ ఎ, బి వైరస్‌ల వలన మాత్రమే వస్తుందని గతంలో అనుకునేవారు. కాని ప్రస్తుతం హెపటైటిస్‌ సి, డి, ఇ, జి అనే వైరస్‌ల వలన కూడా వస్తుందని గుర్తించారు. హెపటైటిస్‌ వైరస్‌లే కాకుండా, ఇతర వైరస్‌లైన సైటోమెగాలోవైరస్‌, ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌, ఎల్లోఫీవర్‌ వైరస్‌, రుబెల్లా వైరస్‌ వలన కూడా పచ్చ కామెర్లు రావచ్చు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగుల్లో హెర్పిస్‌ సింప్లెక్స్‌, వారి సెల్ల, అడినోవైరస్‌ల వలన కూడా పచ్చ కామెర్లు తీవ్రస్థాయిలో వస్తుంది.

కారణాలు
హెపటైటిస్‌ ఎ వైరస్‌ (హెచ్‌ఎవి), హెపటైటిస్‌ బి వైరస్‌ (హెచ్‌బివి), హెపటైటిస్‌ సి వైరస్‌ (హెచ్‌సివి), హెపటైటిస్‌ డి వైరస్‌ (హెచ్‌డివి), హెపటైటిస్‌ ఇ వైరస్‌ (హెచ్‌ఇవి), సైటో మెగాలో వైరస్‌, ఎప్‌స్టీన్‌ బార్‌ వైరస్‌, హెర్పిస్‌ సింప్లెస్‌ వైరస్‌, ఎల్లో ఫీవర్‌ వైరస్‌ మొదలైన వాటి వలన హెపటైటిస్‌ సోకుతుంది.

ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ వ్యాధి కారక క్రిమి శరీరంలో చేరిన తరువాత వ్యాధి లక్షణాలు బైట పడటానికి మధ్య కాలాన్ని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అంటారు.
హెపటైటిస్‌ ఎ -15 నుంచి 45 రోజులు
హెపటైటిస్‌ బి -30 నుంచి 180 రోజులు
హెపటైటిస్‌ డి -30 నుంచి 180 రోజులు
హెపటైటిస్‌ సి -15 నుంచి 160 రోజులు
హెపటైటిస్‌ ఇ -14 నుంచి 60 రోజులు
జాండిస్‌ బైట పడక ముందు ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి.
ఆకలి లేకపోవడం, అలసట, నీరసం, వికారంగా ఉండటం, వాంతులు కావడం, కండరాల, కీళ్ల నొపrలు, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరము, వాసనలు సహించ లేకపోవడం, భోజనం రుచించకపోవడం, మలం బూడిద రంగులో రావడం జాండిస్‌ బైటపడిన తరువాత కింది లక్షణాలు కనిపిస్తాయి.

జాండిస్‌ బైటపడక ముందు ఉన్న లక్షణాలు తగ్గుతాయి. ఆ తరువాత బరువు కోల్పోవడం (రెండున్నరనుంచి ఐదు కిలోల బరువు కోల్పోతారు), కాలేయం వాపు ఎక్కి పెద్దదై, నొప్పిగా ఉండటం, ప్లీహం పెద్దది కావడం, శరీరంపై దురద రావడం (కొంతమందిలో), చర్మంపై రక్తపు చుక్కలు ఏర్పడటం, కళ్లు, చర్మం, ఆమత్వచపు పొరలు పచ్చబడటం తగ్గుముఖం పట్టే దశ

జాండిస్‌ బైటపడటానికి ముందు ఉన్న లక్షణాలు తగ్గిపోతాయి. కాలేయం నార్మల్‌ సైజుకు వస్తుంది. లేదా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎల్‌ఎఫ్‌టి నార్మల్‌గా ఉంటుంది. కొందరిలో కొంచెం అబ్‌నార్మల్‌గా ఉండవచ్చు. కొందరిలో జాండిస్‌ బైటపడకుండా, వ్యాధితో బాధపడటం జరుగవచ్చు.

బడిఈడు పిల్లలతో పని చేయిస్తున్న వారిపై కేసులు

మనుబోలు, న్యూస్‌లైన్: మండలంలోని చెర్లోపల్లిలో బడిఈడు పిల్లలతో ఇళ్లలో పని చేయిస్తున్న నలుగురిపై బాలకార్మిక నిర్మూలన అధికారులు బుధవారం కేసులు నమోదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు ఇళ్లలో 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయిస్తుండడంపై అధికారులకు సబ్ కలెక్టర్ నివాస్‌కు ఫిర్యాదులు అందాయి.

సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలకార్మిక అధికారులు కోటేశ్వరరావు, శివప్రసాద్, శశిధర్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, వీఆర్‌ఓ రామయ్య కలిసి చెర్లోపల్లిలో దాడులు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రావుల శీనయ్య, ఇసనాక మస్తాన్‌రెడ్డి, చేడిమాల రమణకుమార్‌రెడ్డి, చెన్నూరు రామశేషారెడ్డిలపై చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్ సెక్షన్-196 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరికి అపరాధ రుసుం కింద రూ.20 వేల జరిమానా విధించినట్టు తహశీల్దార్ వెంకటనారాయణమ్మ తెలిపారు.

డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలి

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: డీఎస్సీ-2012 నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి జిల్లా నాయకులు వలి రాజు, పరంధామయ్య, ఆదినారాయణ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. డీఎస్సీ ఎంపికల జాబితాను కేటగిరీల వారీగా ప్రకటించి ఉంటే అభ్యర్థులకు సులభతరంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సెలక్షన్ జాబితాను కేటగిరీల వారీగా వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరారు.

జాబితాలో శారీరక వైకల్యం కిం ద ఆర్ధో వైకల్యం ఉన్నవారి పేర్లను మా త్రమే పొందుపరిచారని, మిగిలిన కేట గిరీల్లోని పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యా సంచాలకులు నోటిఫికేషన్‌తోపాటు రోస్టర్ పాయింట్లు కూడా ప్రకటించారని, జిల్లా విద్యాశాఖాధికారి మా త్రం వాటిని ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. 

పదోన్నతులు ఇవ్వాలి 
జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను తక్షణం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు వీవీ రమణయ్య, పరంధామయ్య, ఎన్.శ్రీనివాసులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.

2009 నుంచి జరగుతున్న పదోన్నత్లుల్లో కొన్ని సబ్జెక్టులకు మూడేళ్లకుపైగా క్యారీఫార్వర్డ్ ఉండడం, వాటిని నిబంధనల ప్రకారం సాధారణ పదోన్నతి పోస్టులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

పరీక్షే!

పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతోంది. డిసెంబరు మొదటి వారంలోపు 80 శాతం పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించాల్సి ఉంది. కానీ ఇటు ఉన్నత పాఠశాలల్లోనూ, అటు కళాశాలల్లోనూ పాఠ్యాంశాల బోధన 55 నుంచి 65 శాతానికి మించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఎయిడెడ్ కళాశాలల్లో అయితే ఇప్పట్లో సిలబస్ పూర్తయ్యేలా కన్పించడం లేదు. 

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద 384 ఉన్నత పాఠశాలలున్నాయి. పదో తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23వేల మంది హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చే సింది. పూర్తికాని సిలబస్ విద్యార్థులకు కంగారు పెట్టిస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన పూర్తైపునశ్ఛరణ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సిలబస్ నత్తనడకను తలపిస్తోంది. ఈనెలాఖరులోపు పది పరీక్షల సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉండగా, నవంబరు నెలాఖరు నాటికి 65 శాతం సిలబస్ మాత్రమే పూర్తైది. మరో 24 రోజుల్లో మిగిలిన 35 శాతం సిలబస్‌ను పూర్తి చేయాల్సి ఉండటంతో విద్యార్థులు, అధ్యాపకుల్లో ఆందోళన నెలకొంది. సిలబస్‌ను విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పూర్తి చేయకుంటే దీని ప్రభావం పది ఫలితాలపై తప్పక ఉంటుందని ఉపాధ్యాయులంటున్నారు. 

జిల్లాలోని చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత..విద్యావలంటీర్లను నిమమించుకోవడంలో తాత్సారం ..కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. వెరసి సిలబస్‌ను అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేయలేని దుస్థితి నెలకొంది. డిసెంబరు నెలాఖరులోపు పాఠ్యాంశాల బోధను పూర్తి చేసిన త్రైమాసిక, అర్థసంవత్సర పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాల్సి ఉంది. ప్రత్యేక తరగతులను నిర్వహంచకపోగా, అసలు సిలబస్‌ను పూర్తి చేయలేక అపసోపాలు పడుతున్నారు. పాఠశాలల్లో నిర్వహించాల్సిన ప్రత్యేక తరగతులు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 530 గంటల వరకు సాగాల్సిన ప్రత్యేక తరగతులు చాలా పాఠశాలల్లో కంటితుడుపుగా మారాయి. 

ఉదాహరణలివిగో
తోటపల్లి గూడూరు మండలం వరిగొండ ఉన్నత పాఠశాలలో సైన్సు టీచర్ మెడికల్ లీవ్ మీద వెళ్లారు. రెండు నెలల కిందటే విద్యావలంటీర్‌ను నియమించుకున్నారు. పాఠ్యాంశాల బోధనలో వెనుకబడి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మనుబోలు మండలం మడమనూరు ఉన్నత పాఠశాలలో తెలుగు, బయలాజికల్ సైన్సు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సిలబస్‌ను పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఓజిలి మండలం చిల్లమానుచేను జడ్పీహెచ్‌ఎస్‌లో ఇద్దరు సోషల్ ఉపాధ్యాయులు, ఒక హిందీ ఉపాధ్యాయుని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులను నియమించినా సిలబస్ పూర్తికాలేదు. 

రాపూరు మండం ఏపినాపి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు లేరు. ప్రధానోపాధ్యాయుడే తెలుగు పాఠాలను బోధిస్తున్నారు. 

నగరంలోని వెంకటేశ్వరపురం, మహాత్మాగాంధీనగర్, వెంగళరావునగర్ తదితర ప్రాంతాల్లోని మున్సిపల్ పాఠశాలల్లో కూడా సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. విద్యావలంటీర్లతో సిలబస్‌ను పూర్తిచేయడానికి అక్కడి ప్రధానోపాధ్యాయులు అష్టకష్టాలుపడుతున్నారు.

కొత్త సిలబస్‌తో తంటాలు
జిల్లాలో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఏడు ఎయిడెడ్ కళాశాలలున్నాయి. దాదాపు అన్ని కళాశాలల్లోనూ ఇంత వరకూ 65 శాతం సిలబస్ కూడా పూర్తికాలేదు. సిలబస్‌ను సకాలంలో పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన ఇంటర్ విద్యాశాఖ ఆలస్యంగా మేల్కొంది. 

జాతీయ స్థాయి పరీక్షలైన నీట్, ఐసెట్ తదితర పరీక్షలకు ఇంటర్ విద్యార్థులను సన్నద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్‌లో ఇంటర్ విద్యాశాఖ మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులను అధ్యాపకులకు వివరించి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా ఇన్నాళ్లు ఆ సంగతిని విస్మరించింది. కొందరు అధ్యాపకులు సిలబస్‌ను అర్థం చేసుకోలేక తికమకపడుతూ కొత్త సిలబస్ జోలికే వెళ్లలేదు. మరికొందరేమో పాత సిలబస్‌నే బోధించేశారు. మారిన సిలబస్‌పై బుధవారం నుంచి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం విచిత్రం. 

సైన్సుకు టీచర్ లేరు
సైన్సు సబ్జెక్టుకు టీచర్ లేకపోవడంతో పాఠాలు పూర్తికాలేదు. విద్యావలంటీర్ సార్ పాఠాలు చెబుతున్నారు. డిసెంబరు నెలాఖరుకల్లా పాఠాలన్నీ అయిపోతాయి. 
శరత్, వేణు, వరిగొండ
జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల 

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ రవికుమార్‌గుప్తా పేర్కొన్నారు. స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో బుధవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. దోపిడీలు, దొంగతనాలు ఇటీవల కాలంలో అధికమయ్యాయన్నారు. వాటిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. 

దొంగతనాలు, దోపిడీలు జరిగిన తర్వాత కన్నా వాటిని ముందుగానే పసిగట్టి నియంత్రించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదని సూచించారు. బాధ్యతాయుతంగా పని చేసి పోలీసుశాఖ ప్రతిష్టను ఇనుమడింప జేయాలని ఐజీ సిబ్బందికి సూచించారు. పోలీసు అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సత్వరమే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలన్నారు.

ఒత్తిళ్లకు లొగ్గం
పోస్టింగ్‌లు, పదోన్నతుల విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదని, పారదర్శకంగా నిర్వహించి తీరుతామని ఐజీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తుంచుకోవాలని రవిగుప్తా సూచించారు. ఎస్పీ బీవీ రమణకుమార్ జిల్లా స్థితిగతులను, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐజీకి వివరించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై ఆయన ఐజీకి వివరించారు.

వ్యాన్‌ప్రారంభం
పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ. 3.67లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన టాటా వాహనాన్ని ఐజీ ప్రారంభించారు. ఆ వాహనం పోలీసు గ్యాస్ సరఫరా కోసం వినియోగిస్తామని ఎస్పీ బీవీ రమణకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఎల్‌టీ చంద్రశేఖర్, ఏఆర్ అదనపు ఎస్పీ ఏసీ నాగేశ్వరరావు, నగర, గ్రామీణ, గూడూరు, ఆత్మకూరు డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, బాలవెంకటేశ్వరరావు, సురేష్‌కుమార్, రాజమహేంద్రనాయక్, సీఐలు, పోలీసు అధికారుల సంక్షేమ సంఘ నాయకులు శ్రీహరి, శివ, ఎంటీఆర్‌ఎస్‌ఐ అంకమరావు తదితరులు పాల్గొన్నారు. 

పోర్టులో ఐజీ పర్యటన
ముత్తుకూరు : గుంటూరు రేంజ్ ఐజీ రవికుమార్‌గుప్తా బుధవారం కృష్ణపట్నంపోర్టులో పర్యటించారు. పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న పనులను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఐజీ వెంట ఎస్పీ రమణకుమార్, ఏఎస్పీ చంద్రశేఖర్, రూరల్ డీఎస్పీ బాలవెంకటేశ్వరావు తదితరులు ఉన్నారు. 

చలో... అరుణగ్రహం!

చందమామ చుట్టూ చక్కర్లు కొట్టిరావొచ్చు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతోపాటు కక్ష్యలో విహరించొచ్చు... విదేశాలకెళ్లి వచ్చినట్టుగా అంతరిక్షయాత్రకు వెళ్లిరావొచ్చు... అంతేకాదు...
ఏకంగా అంగారకుడిపైకి వలస వెళ్లి అక్కడే గూడుకట్టుకుని శాశ్వతంగా ఉండిపోవచ్చు కూడా!
మరి మానవజాతికి మరో ‘భూమి’ని అందించేందుకు చేపట్టిన ‘మార్స్ వన్ మిషన్’ సంగతులేంటో చూద్దామా... 


అంగారకుడిపై ఒకప్పుడు నీరు ప్రవహించింది.. జీవం పుట్టుకకు అతికీలకమైన కర్బన మూలకం ఆనవాళ్లనూ క్యూరియాసిటీ రోవర్ ఇటీవలే గుర్తించింది. అయినా.. ఇప్పటికీ మనిషి జీవించే పరిస్థితుల్లేవక్కడ. కానీ... ఇంకో పదేళ్లలోనే అరుణగ్రహంపై నివాసయోగ్యమైన కాలనీ ఏర్పాటవుతుందటున్నారు...‘స్పేస్‌ఎక్స్’ కంపెనీ అధినేత ఎలోన్ మస్క్. అదెలా సాధ్యమన్నదేనా మీ సందేహం... సమాధానాలివిగో...

2023 నాటికి మార్స్‌పై మానవుడికి నివాసయోగ్యమైన స్థావరాన్ని ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు చేపట్టిన కార్యక్రమమే ‘మార్స్ వన్ మిషన్’. స్పేస్‌ఎక్స్‌తోపాటు అనేక కంపెనీలూ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. మార్స్‌పై అన్ని రకాలుగా నివాసయోగ్యమైన స్థావరాలు ఏర్పాటు చేసి, తొలుత పది మందిని, ఆ తరువాత రెండేళ్లకోసారి నలుగురు చొప్పున వ్యోమగాములను పంపించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మార్స్‌పైకి వలస వెళ్లేవారు శాశ్వతంగా అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. స్థానిక పరిస్థితులను బట్టి వారే సొంతంగా అవసరాలను తీర్చుకునేందుకు కొత్త ఉపాయాలు ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తమ్మీద మానవజాతికి మరో ‘భూమి’ని సష్టించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నమాట.

జాబిల్లికంటే అనుకూలం!

భూమి నుంచి చంద్రుడికి ఉన్న దూరం దాదాపు నాలుగు లక్షల కిలోమీటర్లు. అదే అంగారకుడి విషయానికొస్తే ఈ దూరం సగటున 22 కోట్ల కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మరి అంతదూరం కాకుండా ఎంచక్కా చంద్రుడిపైనే కాలనీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా? అన్న సందేహం రావడం సహజం. అయితే చంద్రుడితో పోలిస్తే అంగారకుడిపై కాస్త అనుకూల పరిస్థితులు, వనరులు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. గురుత్వాకర్షణ ఎక్కువగా ఉండటం, భూమి మాదిరిగానే రాత్రి, పగటి వేళలు, రుతువులు ఉండటాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. అందుకే శాస్త్రవేత్తలు ఆ గ్రహంపైనే దష్టిపెట్టారు.

ఏడు నెలల ప్రయాణం

ప్రపంచంలోనే అతిపెద్ద రీయూజబుల్ రాకెట్ ‘స్పేస్ ఎక్స్ డ్రాగన్‌పై మనిషి అంగారక యాత్ర మొదలవుతుంది. ఆక్సిజన్, మీథేన్‌లను ఇంధనంగా వాడుకునే ఈ రాకెట్ అంగారకుడిని చేరేందుకు ఏడెనిమిది నెలలు పడుతుంది. అంతకాలమూ స్పేస్‌షిప్‌లో ఇరుక్కుని వెళ్లాల్సిందే. ఫ్రీజ్ చేసిన, కేన్‌లలోని ఆహారంతోనే కడుపు నింపుకోవాలి. అన్నాళ్లూ తడిగుడ్డ స్నానమే. కండరాల ఆరోగ్యం కోసం రోజూ నియమిత సమయంపాటు కసరత్తులు చేయాల్సిందే. మార్గమధ్యంలో సౌర తుపాను వస్తే గనక.. మరింత ఇరుకైన ఓ చిన్న గదిలోకి వెళ్లి తలదాచుకోవాలి. అందులోనే కొన్ని రోజులు కూడా ఉండాల్సిన అవసరమూ తప్పకపోవచ్చు. అయినా.. మార్స్‌పైకి వెళ్లాలని కల కనేవారికి ఈ అవస్థలు పెద్ద ఇబ్బంది కావేమో!

ఇదీ ప్రణాళిక... 

ముందుగా ‘మార్స్ ఒయాసిస్సు’ పేరుతో చిన్న రోబోటిక్ ల్యాండర్‌ను పంపుతారు. చిన్నపాటి గ్రీన్‌హౌస్‌లా ఉండే దీంట్లో అక్కడి మట్టితోనే ప్రయోగాత్మకంగా పంటలు పండిస్తారు. ఫలితాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక వసతులు కల్పించేవారిని భాగస్వాములుగా చేసుకుని అసలు కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఈ యాత్రకు సంబంధించిన పనులు త్వరలో అంటే వచ్చే ఏడాది నుంచే మొదలుకానున్నాయి. మార్స్ రాకెట్ స్పేస్‌ఎక్స్ హెవీలాంఛర్‌ను వచ్చే ఏడాది నుంచి దశలవారీగా పరీక్షిస్తారు. అదేసమయంలో మొత్తం 40 మంది వ్యోమగాములను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించనున్నారు. 2014లో భూమిపైనే మార్స్‌ను పోలిన వాతావరణాన్ని సృష్టించి అక్కడ వీరికి శిక్షణ ఇస్తారు. ఆ తరువాత రెండేళ్లకు మౌలిక వసతుల ఏర్పాటుకు అవసరమైన వస్తువుల రవాణా మొదలవుతుంది.

2018లో తొలి రోవర్ దిగుతుంది. ఆవాసయోగ్యమైన చోటును వెతుకుంది. అది స్వతంత్రంగా పనిచేస్తూ సమాచారం పంపుతుంది. అవసరమనుకుంటే దానిని భూమి నుంచి కూడా నియంత్రిస్తారు. 2021 నాటికి ఆరు వేర్వేరు ల్యాండర్లలో మొత్తం ఆరు యూనిట్లు, రెండు రోవర్లు, ఇతర వస్తువులన్నీ చేరిపోతాయి. 2022 మొదలు నాటికి నీరు, ఆక్సిజన్ వంటివన్నీ సిద్ధమవుతాయి. 2023లో తొలి బందం మార్స్‌పై కాలుమోపుతుంది. క్యాప్సూల్స్ మధ్య కనెక్టింగ్ ట్యూబుల ఏర్పాటు, ఆహార ఉత్పత్తి, సోలార్ ప్యానెల్స్ బిగింపు వంటివి చేసుకుంటారు. కొత్త ‘ఇళ్ల’ను సర్దుకుని కొత్త జీవనం ప్రారంభిస్తారు. కొన్నాళ్లకు మరిన్ని సరుకులు, యూనిట్లు, రోవర్, మరో బందాన్ని వరుసగా పంపుతారు. అయితే, మార్స్ వన్ మిషన్‌లోని ప్రతి ఘట్టమూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. వారి దినచర్యలను కూడా రియాల్టీ షో మాదిరిగా లైవ్‌లో ప్రసారం చేస్తారు.

ఇలా బతకాలి...

స్పేస్‌షిప్‌లో పంపే ల్యాండర్‌లో నివాసం, ఆహారం, గాలి తయారీ, వివిధ సౌకర్యాల కోసం ఐదు యూనిట్లు ఉంటాయి. వస్తువుల రవాణాకు రెండు రోవర్లు ఉంటాయి. బయట తిరిగేందుకు ప్రత్యేక మార్స్ సూట్‌లు ఉంటాయి. అంగారక గ్రహంపై వాటర్ ఐస్‌తో కూడిన మట్టిని మట్టిని వేడి చేయడం ద్వారా నీటిని తయారు చేసుకోవాలి. ఈ నీటినే తాగడానికి, ఆక్సిజన్ తయారీకి, పంటలకు, అన్ని అవసరాలకూ ఉపయోగించాలి. సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్ తయారు చేసుకోవాలి. మార్స్ గాలిలోని నైట్రోజన్ సమద్ధిగా ఉండటమూ కలిసి వస్తుంది (మనం పీల్చేగాలిలో 80 శాతం ఇదే ఉంటుంది). ఎరువులను ఉత్పత్తిచేసే యంత్రాలు, మార్స్ వాతావరణంలోని కార్బన్ డయాకై ్సడ్, నైట్రోజన్‌లను ఉపయోగించి మీథేన్, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారు. పారదర్శక గుమ్మటాలను నిర్మించి, వాటి కింద మార్స్ మట్టిపై పంటలు పండిస్తారు. అలా మార్స్ కాలనీలో సౌకర్యాలు పెరిగిన తర్వాత అదే రాకెట్ వెనక్కి వచ్చి మళ్లీ కొత్తవారిని, కొద్దిమొత్తంలో వస్తువులను తీసుకెళుతుంది. తొలుత భూమి నుంచి అత్యవసరమైన పరికరాలు, వస్తువులు, ఆహారం తీసుకెళ్లినా.. తర్వాత అక్కడి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అవసరాలు తీర్చుకోవడం, ప్రత్యామ్నాయ ఉపాయాలను ఆలోచించడం వంటివి తప్పవు. రానురాను స్థానిక పరిస్థితులు, పదార్థాలతోనే వికాసం సాధించాలి.
- హన్మిరెడ్డి యెద్దుల 

అంతరిక్షరంగంలోతొలి ప్రైవేటు కంపెనీ... 

దక్షిణాఫ్రికా అమెరికన్ వ్యాపారవేత్త అయిన ఎలోన్ మస్క్ స్థాపించిన ‘స్పేస్‌ఎక్స్’ అంతరిక్ష రవాణారంగంలో అడుగుపెట్టిన తొలి ప్రై వేటు కంపెనీగా చరిత్ర సష్టించింది. ఫాల్కన్-9 హెవీ రాకెట్‌ను కూడా ఇటీవలే విజయవంతంగా ప్రయోగించింది. నాసాకు ప్రధాన వ్యాపార భాగస్వామి అయిన ఈ కంపెనీయే మార్స్ వన్ మిషన్‌లో భాగంగా అంగారకుడిపైకి పరికరాలు, మనుషుల రవాణా చేపట్టనుంది. ఆధునిక టెక్నాలజీ వినియోగంతో అంతరిక్షయానాకియ్యే ఖర్చును భారీగా తగ్గించవచ్చని మస్క్ అంటున్నారు. ఏదో ఒకరోజు అమెరికావంటి దేశాల్లోని సగటు మనిషికి కూడా అంగారకయాత్ర అందుబాటులోకి తే వడం, మార్స్‌పై 80 వేల మందితో ఓ చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు.

టిక్కెట్టు... 5 లక్షల డాలర్లు మాత్రమే!

మరో పదేళ్లనాటికి అంగారక యాత్రను ఐదు లక్షల డాలర్ల మొత్తానికే అందుబాటులోకి తీసుకురానున్నామని నిర్వాహకులు అంటున్నారు. అప్పటికిప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని, లక్షమందిలో ఒకరు సిద్ధమైనా.. 80 వేల మంది అవుతారని అంచనా. మార్స్‌పై ఒక కాలనీ ఏర్పాటుకు మొత్తం 36 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని, వలసవెళ్లే వారంతా ఐదు లక్షల డాలర్ల చొప్పున ఇవ్వగలిగితే 40 బిలియన్ డాలర్లు వస్తాయని అంటున్నారు. 
 

తెలుగు మహాసభల నిర్వహణపై సమీక్ష

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. తిరుపతిలో తెలుగు మహాసభలు కోసం సిద్ధం చేస్తున్న అవిలాల చెరువు భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయింది. దీంతో సభల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. సభల్ని వాయిదా వేయాలని నిర్వహకులు కోరుతున్నారు. 

కాగా సీఎం సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రపంచ తెలుగు మహాసభల వాయిదాపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు వేదిక మార్పును పరిశీలిస్తున్నారు.

Monday 3 December 2012

telugu heroines and heroes images



heroines and heroes

Page 2
Page 3

Page 4

    Page 5
    Page 6

    Page 7

      Page 9

      Page 10
      Page 11
      Page 12
      Page 13