ప్రేమను నిరూపించుకోవాలి ఒకరిని ప్రేమించడమంటే, ప్రేమించే సత్తాను కూడదీసుకొని, యదార్థం చేసుకోవడం. ప్రేమలో ఉన్న ప్రాధమిక నిశ్చయం, ప్రేమించిన వ్యక్తిని మానుష గణాల అవతారంగా గ్రహించి, దానివైపు నిర్దేశిత మవ్ఞతుంది. ప్రేమించడమంటే మనిషిని యధాతధంగా ప్రేమించడమే. విలియమ్ జేమ్స్ చెప్పిన 'శ్రమ విభజన రీతిలో ఒకడు తన కుటుంబాన్ని ప్రేమించి, కొత్తవానిని ప్రేమించకలేకపోతే అది ప్రాధమిక ప్రేమ అసమర్థతకు గుర్తు. తరచు మనం అనుకొన్నట్లు, ఎవరో ఒకరిని ప్రేమించిన తర్వాత అందులోనుంచిుత్పన్నమయ్యే అమూర్తభావన కాదు ప్రేమ. ఎవరినో ఒకరిని ప్రేమించడంలో అది ఉత్పన్నమవ్ఞతున్నప్పటికి, దానికి మాతృక అదే. దీనినిబట్టి ఇతరులు నా ప్రేమకు ఎలా వస్తువ్ఞలో నేను అంతేనని తేలుతుంది. జీవితాన్ని సుఖసంతోషాదులను, స్వేచ్ఛా వికాసాలను నిరూపణం చేసుకోవడమనేది అతని ప్రేమ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే, ఆపేక్ష, గౌరవం, బాధ్యత, అవగాహనలతో వేరూని ఉంటుంది. ఒక వ్యక్తి సృజనాత్మకంగా ప్రేఇంచగలిగి నపrడే తనను తాను ప్రేమించుకోగలుగుతాడు. అతడు ఇతరులను మాత్రమే ప్రేమించగలిగితే, అసలతడు ప్రేమించలేనేలేడు. స్వప్రేమ, పరప్రేమ సంయోజకాలని ఒపrకొన్న తర్వాత, పరుల మీద ఆపేక్షను త్రోసివేసి స్వార్థాన్ని, మనం ఎలా వివరిస్తాం. స్వార్థపరుని కెపrడూ తనమీదే ఆసక్తి. అన్నీ తనకే కావాలంటాడు. పుచ్చుకోవడంలో తప్ప, అతనికి ఇవ్వడంలో ఆనందం లేదు. బాహ్యప్రంచం నుంచి తనకు చేకూరే మేలును దృష్టిలో పెట్టుకొని, దానిని చూస్తాడు.
|
No comments:
Post a Comment