Thursday 6 December 2012

5 ఏళ్లలో అరకోటి ఇళ్లు


NewsListandDetails
రాష్ట్రంలో విద్యుత్‌ ఉతపత్తి రెట్టింపు చేస్తామని, నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రణాళికలో వివరించారు. సోమవారం ఆయన తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసారు. గుజరాత్‌ ప్రజల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివ]ద్ధి చెందు తుందన్నారు.నిరుపేదల నుండి  కొత్త మధ్యతరగతి ప్రజలు వస్తున్నారని ఆయన వివరించారు. అన్ని నివాస గ]హాలకు సురక్షిత  మంచినీరు అందిస్తామని, 30 లక్షల మందకి ఉద్యోగాలు, అదే విధంగా 50 లక్షల మందికి నివాస గ]హాలు నిర్మాణం చేస్తామన్నారు. సూరత్‌,వడోదర,రాజ్‌కోట్‌ నగరాలలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం  పూర్తి చేస్తామని ఆయన తన ఎన్నికల మానిఫెస్టోలో వివరించారు. నిరుపేదల నుండి కొత్తగా మధ్యతరగతి ప్రజలు వస్తున్నారన్నారు. నిరు పేదలకు అతి తక్కువ ఖర్చుతో పక్కా గ]హాలు నిర్మిస్తామన్నారు. అదే విధంగా మహిళా సాధికారితకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. గ్రామీణ యోజ్‌గార్‌ పథకాన్ని గ్రామ స్థాయిలో ప్రవేశపెట్టి గ్రామాలను మరింతగా అభివ]ద్ధి చేయడం జరుగుతుందన్నారు. జౌళి ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్‌ పాల ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా తీసుకుని రావడానికి క]షి చేస్తున్నట్లు ఆయన వివరించారు. యువకులను అన్ని రంగాలలో ముందుకు తీసుకుని వెళ్లడానికి ప్రణాళికలు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే గుజరాత్‌ యువ కులు అÊగ్రగామిగా ఉండడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంచి  నిపుణు లుగా తీర్చి దిద్దుతామన్నారు. రైతులపై రుణభారం పడకుండా జాగ్రత్తలు తీసు కుంటామన్నారు. వారికి వడ్డీలేని రుణాలు అందచేస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో నూతనసాంకేతిక వ్యవస్థను తీసుకువచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతామన్నారు.

No comments:

Post a Comment