Wednesday, 5 December 2012

బడిఈడు పిల్లలతో పని చేయిస్తున్న వారిపై కేసులు

మనుబోలు, న్యూస్‌లైన్: మండలంలోని చెర్లోపల్లిలో బడిఈడు పిల్లలతో ఇళ్లలో పని చేయిస్తున్న నలుగురిపై బాలకార్మిక నిర్మూలన అధికారులు బుధవారం కేసులు నమోదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు ఇళ్లలో 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయిస్తుండడంపై అధికారులకు సబ్ కలెక్టర్ నివాస్‌కు ఫిర్యాదులు అందాయి.

సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు బాలకార్మిక అధికారులు కోటేశ్వరరావు, శివప్రసాద్, శశిధర్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటనారాయణమ్మ, వీఆర్‌ఓ రామయ్య కలిసి చెర్లోపల్లిలో దాడులు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రావుల శీనయ్య, ఇసనాక మస్తాన్‌రెడ్డి, చేడిమాల రమణకుమార్‌రెడ్డి, చెన్నూరు రామశేషారెడ్డిలపై చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేటరీ యాక్ట్ సెక్షన్-196 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరికి అపరాధ రుసుం కింద రూ.20 వేల జరిమానా విధించినట్టు తహశీల్దార్ వెంకటనారాయణమ్మ తెలిపారు.

No comments:

Post a Comment