వైరల్ హెపటైటిస్ అనే వ్యాధి హెపటైటిస్ ఎ, బి వైరస్‌ల వలన మాత్రమే వస్తుందని గతంలో అనుకునేవారు. కాని ప్రస్తుతం హెపటైటిస్ సి, డి, ఇ, జి అనే వైరస్‌ల వలన కూడా వస్తుందని గుర్తించారు. హెపటైటిస్ వైరస్‌లే కాకుండా, ఇతర వైరస్‌లైన సైటోమెగాలోవైరస్, ఎప్‌స్టీన్ బార్ వైరస్, ఎల్లోఫీవర్ వైరస్, రుబెల్లా వైరస్ వలన కూడా పచ్చ కామెర్లు రావచ్చు. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన రోగుల్లో హెర్పిస్ సింప్లెక్స్, వారి సెల్ల, అడినోవైరస్‌ల వలన కూడా పచ్చ కామెర్లు తీవ్రస్థాయిలో వస్తుంది.
కారణాలు హెపటైటిస్ ఎ వైరస్ (హెచ్‌ఎవి), హెపటైటిస్ బి వైరస్ (హెచ్‌బివి), హెపటైటిస్ సి వైరస్ (హెచ్‌సివి), హెపటైటిస్ డి వైరస్ (హెచ్‌డివి), హెపటైటిస్ ఇ వైరస్ (హెచ్‌ఇవి), సైటో మెగాలో వైరస్, ఎప్‌స్టీన్ బార్ వైరస్, హెర్పిస్ సింప్లెస్ వైరస్, ఎల్లో ఫీవర్ వైరస్ మొదలైన వాటి వలన హెపటైటిస్ సోకుతుంది.
ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యాధి కారక క్రిమి శరీరంలో చేరిన తరువాత వ్యాధి లక్షణాలు బైట పడటానికి మధ్య కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. హెపటైటిస్ ఎ -15 నుంచి 45 రోజులు హెపటైటిస్ బి -30 నుంచి 180 రోజులు హెపటైటిస్ డి -30 నుంచి 180 రోజులు హెపటైటిస్ సి -15 నుంచి 160 రోజులు హెపటైటిస్ ఇ -14 నుంచి 60 రోజులు జాండిస్ బైట పడక ముందు ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, అలసట, నీరసం, వికారంగా ఉండటం, వాంతులు కావడం, కండరాల, కీళ్ల నొపrలు, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరము, వాసనలు సహించ లేకపోవడం, భోజనం రుచించకపోవడం, మలం బూడిద రంగులో రావడం జాండిస్ బైటపడిన తరువాత కింది లక్షణాలు కనిపిస్తాయి.
జాండిస్ బైటపడక ముందు ఉన్న లక్షణాలు తగ్గుతాయి. ఆ తరువాత బరువు కోల్పోవడం (రెండున్నరనుంచి ఐదు కిలోల బరువు కోల్పోతారు), కాలేయం వాపు ఎక్కి పెద్దదై, నొప్పిగా ఉండటం, ప్లీహం పెద్దది కావడం, శరీరంపై దురద రావడం (కొంతమందిలో), చర్మంపై రక్తపు చుక్కలు ఏర్పడటం, కళ్లు, చర్మం, ఆమత్వచపు పొరలు పచ్చబడటం తగ్గుముఖం పట్టే దశ
జాండిస్ బైటపడటానికి ముందు ఉన్న లక్షణాలు తగ్గిపోతాయి. కాలేయం నార్మల్ సైజుకు వస్తుంది. లేదా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఎల్‌ఎఫ్‌టి నార్మల్‌గా ఉంటుంది. కొందరిలో కొంచెం అబ్‌నార్మల్‌గా ఉండవచ్చు. కొందరిలో జాండిస్ బైటపడకుండా, వ్యాధితో బాధపడటం జరుగవచ్చు.
|
No comments:
Post a Comment