Saturday 29 December 2012

యల్లాయపాళెంవ్యవసాయం


వ్యవసాయం

ఒకప్పుడు వరిచెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.
  • ఇప్పుడు రొయ్యలసాగు ఆగిపోయింది.ఆ మాటకొస్తె జిల్లాలో కూడ సాగుబడి చాలవరకు తగ్గిపోయింది.ఒకప్పుడు 1,50,000 ఎకరాలు సాగులోవుండేవి.
ఇప్పుడు 50,000.ఎకరాలు కంటే సాగు తగ్గిపోయింది.రొయ్యల గుంటలన్ని పూడ్చి మళ్ళి వరి సాగుమొదలు పెట్టారు. గ్రామంలో దాదాపు 3,000ఎ.సాగుబడి పొలం వున్నది.పడమరనున్న అడివి పొలం తప్పితే మిగిలిన పొలానికి చాలవరకు బోరు బావులున్నాయి. మొదటి కారు,అప్పుడప్పుడు రెండొ కారు కనిగిరి చెరువు నీటితో సాగు అవుతున్నాయి. 20సం:ముందు ప్రధాన పంటగా మొలగొలుకులు, రెండో పంటగా దొంగ నెంబర్లు(అంతకుముందు ఎర్రకేసర్లు)పండించేవారు.ఇప్పుడు మొలగొలుకులు కనుమరుగయినాయి.మూడు పిడికిళ్ళులాంటి హైబ్రిడ్ రకాలు సాగుచేస్తున్నారు. పొలాల ధరలు కూడ బాగా పెరిగాయి.ఒక ఎకరం రూ.పది లక్షలు. గతంలో 200-300 ఎకరాల కమతాలు కొన్ని వుండేవి.ఇప్పుడు 30 ఎ.మించి ఎవరికి లేవు. గతంలో ఎద్దులు,బండ్లు,నాగళ్ళు,తదితర పరికరాలతో వ్యవసాయం చేసేవారు.ఇప్పుడు ట్రాక్టర్లు,వరికోత మిషన్లు. వ్యవసాయ కూలీలు బాగా తగ్గిపోయారు.సేద్యం చేయించడం చాలా కస్టంగా వుంది.
  • పాడి పరిశ్రమ బాగా అభివృద్ధిచెందినది.పాలు గతంలో బస్సులోను,సైకిళ్ళలోను నెల్లూరుకు తీసికెళ్ళి అమ్మేవారు.ఇప్పుడు పాల సొసైటీలు వున్నాయి.

No comments:

Post a Comment