Wednesday, 5 December 2012

డీఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలి

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: డీఎస్సీ-2012 నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి జిల్లా నాయకులు వలి రాజు, పరంధామయ్య, ఆదినారాయణ బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. డీఎస్సీ ఎంపికల జాబితాను కేటగిరీల వారీగా ప్రకటించి ఉంటే అభ్యర్థులకు సులభతరంగా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సెలక్షన్ జాబితాను కేటగిరీల వారీగా వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరారు.

జాబితాలో శారీరక వైకల్యం కిం ద ఆర్ధో వైకల్యం ఉన్నవారి పేర్లను మా త్రమే పొందుపరిచారని, మిగిలిన కేట గిరీల్లోని పేర్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యా సంచాలకులు నోటిఫికేషన్‌తోపాటు రోస్టర్ పాయింట్లు కూడా ప్రకటించారని, జిల్లా విద్యాశాఖాధికారి మా త్రం వాటిని ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. 

పదోన్నతులు ఇవ్వాలి 
జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను తక్షణం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు వీవీ రమణయ్య, పరంధామయ్య, ఎన్.శ్రీనివాసులు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు.

2009 నుంచి జరగుతున్న పదోన్నత్లుల్లో కొన్ని సబ్జెక్టులకు మూడేళ్లకుపైగా క్యారీఫార్వర్డ్ ఉండడం, వాటిని నిబంధనల ప్రకారం సాధారణ పదోన్నతి పోస్టులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment