Saturday 29 December 2012

యల్లాయపాళెం చరిత్ర


చరిత్ర

1946 ముoదు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మేటి గ్రామాలలో ఒకటి. ఊళ్ళో పంట రెడ్లు ఎక్కువ. వీరు భూస్వాములూ వ్యవసాయదారులూ కూడా. వీరు కాక దేవాంగులూ(చేనేత పనివారు), ముస్లిం లు, బలిజ వారు, హరిజనులు, ఇతర చేతి వృత్తుల వారు ఉండేవారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే చాలాకాలంగా పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, వాలు పాఠ్యంపెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో గూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉంది.
1946 తర్వాత
చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మేటి గ్రామం గానే వెలుగొందుతోంది. గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు. గ్రామస్తుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.
1950 దశకంలొ[ఆధారం కోరబడినది] అప్పుడు నేను పది సం.వాడిని .నాకు నాకంటే పెద్దవారికి ఈసంగతులన్ని తెలుసు.ఇప్పుదు నేను అమెరికాలో ఉన్నాను.ఆధారాలు కోసం ప్రయత్నిస్తాను.
గ్రామం లొ తగాదాలు వుండేవి.రైతులు హరిజనులు మధ్య కొట్లాటలు జరిగాయి. ఇరువురు కొన్నిసార్లు కర్రలతోను,కొన్నిసార్లు కత్తులతో కొట్లాడుకొన్నారు. చాలా మంది పెద్ద గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇరువురు పోలీసు కేసులు పెట్టుకున్నారు.ఈ జామీనుకేసుల్లో జిల్లాలోని వివిధ కోర్టుల చుట్టూ తిరిగారు. అలిసిపోయారు.తిరిగి ప్రశాంతత నెలకొన్నది.
1960 దశకంలో
భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామంలోని యువత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసారు. యువత విజయం సాధించింది.గండవరపు బాలక్రిష్ణా రెడ్డి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.
1970 దశకంలో
గ్రామంలో కమ్యూనిస్టు ఉద్యం మొదలయింది.మళ్ళీ కొంతకాలం తగాదాలు,కొట్లాటలు జరిగాయి. ఒక రైతు కూడ చనిపోయాడు. ప్రస్తుతం పెద్ద తగాదాలు లేవు.కాని సదవగాహన కూడ లేదు.

No comments:

Post a Comment